Breaking News

బర్డ్‌ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్‌!

Published on Sat, 04/27/2024 - 12:20

జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్‌ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.

యూఎస్‌ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.

అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.

అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు.

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి