Breaking News

ప్రాణం పోయినంత పనైంది

Published on Sun, 03/16/2025 - 05:41

డెన్వర్‌: ఏదైనా ఒక విమాన ప్రమాదం నుంచి కాస్తంతలో తప్పించుకోగానే అందులోని ప్రయాణికుల ప్రాణాలు లేచొస్తాయి. హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్న కొద్దిసేపటికే మళ్లీ అదే విమానం మరో రకమైన ప్రమాదంలో పడితే ఆ ప్రయాణికుల భయాందోళనలు వర్ణనాతీతం. శుక్రవారం అమెరికాలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అ య్యాక మంటలు చెలరేగిన విమానంలోని ప్రయాణికుల పరిస్థితి దాదాపు అలాగే ఉంది.

స్వల్పగాయాలతో బయపడిన ప్రయాణికులు ఎట్టకేలకు బతుకుజీవుడా అంటూ విమానం రెక్క పైనుంచి, అత్యవసర ఎస్కేప్‌ స్లైడ్‌ నుంచి బయటపడ్డారు. కొలర్యాడో స్పింగ్స్‌ నుంచి టెక్సాస్‌లోని డల్లాస్‌ ఫోర్ట్‌వర్త్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడం, అత్యవసరంగా డెన్వర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగడం తెల్సిందే. మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి సురక్షితంగా బయటపడిన మైఖేల్‌ ఉడ్స్‌ అనే మహిళ ప్రమాద ఘటనను గుర్తుచేసుకున్నారు.

‘‘కొలర్యాడో స్పింగ్స్‌ నుంచి బయల్దేరినప్పడు అంతా బాగానే ఉంది. కానీ మార్గమధ్యంలో విమాన ఇంజన్లలో ఒకదాని నుంచి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దాని తర్వాత విమానం అటూ ఇటూ ఊగడం మొదలైంది. మా పని అయిపోయిందనుకున్నాం. కానీ విమానాన్ని వెంటనే డెన్వర్‌కు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో హమ్మయ్య అనుకున్నా. హాయిగా ఊపిరిపీల్చుకునేలోపే విమానం క్యాబిన్‌లో దట్టమైన పొగకమ్ముకోవడం మొదలైంది.

తర్వాత మంటలు వ్యాపించాయి’’అని ఆమె చెప్పారు. ‘‘విమా నం ఆగగానే కదిలే మెట్లను తీసుకురాలేదు. ఆలోపు బయటకు వెళ్లేందుకు మార్గంలేక చివరకు విమానం రెక్క మీదకు వచ్చేశాం. రెక్క నుంచి ఎలా దిగాలో, ఎలా బయటపడాలో ఎవరికీ అర్థంకాలేదు. అందు కే అందరం అలా నిల్చుని హాహాకారాలు చేశాం. ఈలోపు సాయం చేయడానికి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఎవరూ ముందుకురాలేదు. ఈలోపు నా భర్త, కుమార్తె ఏమయ్యారో తెలియలేదు. భయంతో వణికిపోయా.

కుదురుగా ఒక్కచోట రెక్కపై నిలబడలేకపోయా’’అని ఇన్‌గ్రిడ్‌ హిబిట్‌ అనే మహిళ తెలిపింది. ‘‘అంతా సర్దుకుంటుందిలే అని మనసులో చెప్పుకున్నాగానీ మాకేమైపోతుందోనన్న భయం మరింత పెరిగింది. ఒక పది నిమిషాల తర్వాత ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వచ్చి సహాయకచర్యలు హుటాహుటిన మొదలెట్టారు. కానీ ఆ ఒక్క పది నిమిషాలే పది యుగాలుగా గడిచాయి. 

స్వల్ప గాయాలు మినహా అందరూ క్షేమంతా బయటపడటం నిజంగా అద్భుతంలా అనిపించింది’’అని ఆమె అన్నారు. ‘‘కుదుపులకు లోనైన కొద్దిసేపటి తర్వాత విమానం ల్యాండ్‌ అయిందికాబట్టి సరిపోయింది. ఒకవేళ ల్యాండ్‌ చేయకుంటే అలాగే వెళ్లిఉంటే మార్గమధ్యంలో ఆకాశంలో మంటలు చెలరేగి మేమంతా ఏమయ్యేవాళ్లమో’’అని ఆమె భయందోళనలు వ్యక్తంచేశారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)