Breaking News

నోట మాట రాలేదు..! 

Published on Thu, 12/18/2025 - 05:54

విమాన ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని అద్భుతమైన ఫొటో తీసి, దాన్ని చూపించి ‘ఒక ఫ్రీ టికెట్‌ ఇస్తారా?’ అని మీరెప్పుడైనా అడిగారా? అడిగి ఉండరు కదా.. ‘రైనైర్‌’.. అంటేనే, టికెట్‌ ధర కంటే లగేజ్‌ రుసుము ఎక్కువ ఉండే బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ అని ప్రపంచం మొత్తం తెలుసు. 

అలాంటిది.. ఐర్లాండ్‌ దేశానికి చెందిన ఈ ఎయిర్‌లైన్‌ని ఫ్రీ టికెట్‌ అడగడం అంటే.. గోతికాడ నక్కని బిర్యానీ అడిగినట్లే.. ఓకే, కథలోకి వెళ్దాం. అనగనగా ఒక తింగరోడు విమానంలో రోమ్‌ నగరం మీదుగా వెళ్తున్నాడు. ఆకాశం నీలం, కింద ఇటలీ రాజధాని నగరం అద్భుతంగా కనిపిస్తున్నాయి. వెంటనే తన మొబైల్‌లో ఓ అద్భుతమైన ఏరియల్‌ షాట్‌ తీశాడు. అందులో విమానం రెక్క, కింద పట్నం కళ్లకు విందు చేసేలా ఉన్నాయి. 

ఫొటో తీశా చూడండి.. 
ఆ ఫొటో చూశాక మనోడిలో ఆశ చిగురించింది. ‘ఆహా! ఈ ఫొటోకి కనీసం ఒక ఫ్రీ టికెట్‌ అడగాల్సిందే!’ అనుకున్నాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా, ఆ గొప్ప ఫొటోను ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశాడు. దానిని రైనైర్‌ ఎయిర్‌లైన్‌కి ట్యాగ్‌ చేశాడు. ‘ఈ అద్భుతమైన ఫొటోకి బదులుగా నాకు ఒక ఉచిత విమాన టికెట్‌ ఇవ్వగలరా?’.. అని మరీ అమాయకంగా అడిగాడు. దానికి ఏదో నవ్వుతూ, నాలుగు మంచి మాటలు చెబుతారని, లేదా ఓ నవ్వుతున్న ఎమోజీ పంపిస్తారని ఆశించినట్లున్నాడు పాపం. 

ఒక్క మాటతో కథ క్లోజ్‌! 
రైనైర్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ఉంది చూశారూ.. వాళ్లు సామాన్యులు కారు. వీళ్లు వెటకారానికి బ్రాండ్‌ అంబాసిడర్లు. విషయం ఏంటంటే, వారు నిమిషం కూడా ఆలోచించకుండా, మర్యాదలన్నీ తుంగలో తొక్కి.. కేవలం ఒక్కే ఒక్క మాట.. నో.. (లేదు) అని జవాబిచ్చారు. అతన్ని ఏ మాత్రం నొప్పించకుండా, నెప్పి తెలియకుండా.. ఒక్కే ఒక్క పదంతో ‘గేట్‌’ మూసేశారు. అడగ్గానే ‘ఫ్రీ టికెట్‌’ దొరుకుతుందనుకున్న ఆ ప్రయాణికుడికి.. ఎయిర్‌లైన్‌ స్టైల్‌లో ముఖం మీదే ‘ఇక్కడ చపాతీ కూడా ఉచితంగా దొరకదు, నువ్వా ఫ్రీ టికెట్‌ అడుగుతున్నావ్‌?’ అని సూటిగా చెప్పినట్లయింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)