Breaking News

ట్రంప్‌కు పనామా అధ్యక్షుడి కౌంటర్‌

Published on Fri, 12/27/2024 - 11:25

పనామాసిటీ:త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పనామా కాలువ(Panama Canal)ను కొనేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో తాజాగా స్పందించారు. అసలు ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.

ఈమేరకు ములినో మీడియాతో మాట్లాడారు. కాలువ పనామేనియన్లకు చెందిందన్నారు. కెనాల్‌పై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికా(America) వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలుచేస్తోందనే ట్రంప్‌ ఆరోపణలను ములినో ఖండించారు.అదేవిధంగా  పనామా కెనాల్‌లో చైనా జోక్యం లేదన్నారు.

కెనాల్ రుసుములు పబ్లిక్‌ అండ్‌ ఓపెన్ ప్రాసెస్ కింద అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ పాదర్శకంగా నిర్ణయిస్తారన్నారు.కాగా, ట్రంప్ ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ..అట్లాంటిక్‌, పసఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

అమెరికాకు చెందిన వాణిజ్య,నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని,వీటిని తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలన్నారు. దీంతో పాటు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ట్రంప్‌ అన్నారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)