Breaking News

21 నెలలు.. 58 వేల మరణాలు!

Published on Mon, 07/14/2025 - 05:24

దెయిర్‌ అల్‌–బలాహ్‌: గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దాడుల్లో మరణాలు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 58 వేల మంది పాలస్తీనియన్లు అసువులు బాసినట్లు ఆదివారం గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా మహి ళలు, చిన్నారులే ఉన్నారంది. క్షత గాత్రుల సంఖ్య లక్ష్యల్లోనే ఉంటుందని అంచనా. యుద్ధ మరణాలపై గాజా ఆరోగ్య విభాగం విడుదల చేసే గణాంకాలను ఐక్యరాజ్యస మితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీ యమైనవిగా భావిస్తున్నాయి. 

నీళ్ల కోసం వచ్చి ఆరుగురు బాలలు మృతి
గాజాపై ఆదివారం ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. వీరిలో నీళ్ల ట్యాంకు వద్దకు వచ్చిన ఆరుగురు చిన్నారులున్నారు. సెంట్రల్‌ గాజా నగరంలో ఓ వీధిలో నడిచి వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 11 మంది చనిపోగా 30 మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో అల్‌–అహ్లి ఆస్పత్రి జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ అహ్మద్‌ ఖండిల్‌ కూడా ఉన్నారు. ఆస్పత్రికి వస్తుండగా దాడికి గురయ్యారని అధికారులు తెలిపారు. జవైదాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇంటిపై దాడి విషయం తమకు తెలీదని, 24 గంటల వ్యవధిలో గాజాలోని 150 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. కాగా, వెస్ట్‌బ్యాంక్‌లో శనివారం ఇజ్రాయెల్‌ సెటిలర్ల కాల్పుల్లో చనిపోయిన పాలస్తీనా అమెరికన్‌ సైఫొల్లా ముసల్లెట్‌(20), అతని స్నేహితుడు మహ్మద్‌ అల్‌ షలాబీలకు ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ సారథ్యంలో సాయుధులు ఇజ్రాయెల్‌ భూభాగంపై మెరుపుదాడులు చేసి సుమారు 1,200 మందిని చంపడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్‌ ఆర్మీ హమాస్‌ లక్ష్యంగా గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తోంది. 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)