Breaking News

తాలిబన్ల ఆయుధాలపై పాక్‌ వణుకు!

Published on Thu, 06/20/2024 - 07:28

పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్‌ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ)ని వేడుకుంటోంది.

పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్‌లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్‌ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్‌ ఇప్పుడు పాకిస్తాన్‌పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.

తెహ్రీక్‌ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్‌ తాజగా యూఎన్‌ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు  సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్‌ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)