Breaking News

దైవ దూషణ నెపం.. పాకిస్తాన్‌లో మరో దారుణం

Published on Sat, 09/21/2024 - 08:45

కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో అమానవీయ ఉదంతం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యుని మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా దహనం చేసిన వైనం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే సింధ్ ప్రావిన్స్‌లో దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న షానవాజ్‌ కంబార్‌ అనే వైద్యుడు పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరిస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ పోలీసు ఆ వైద్యునిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో ఆ వైద్యుడు మృతిచెందాడు. కంబార్ మృతదేహాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అప్పగించారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు. అయితే వైద్యునిపై కాల్పులు జరిపిన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నియాజ్ ఖోసో ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఆ వైద్యునితో పాటు అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ నేపధ్యంలోనే తాము ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు.

స్థానిక పోలీసు అధికారి షకుర్ రషీద్ మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన జాన్‌హీరోలో వైద్యునికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో కొందరు ఆ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి భయపడిన మృతుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు. దీంతో ఆ అల్లరి మూక వైద్యుని మృతదేహనికి నిప్పు పెట్టిందని రషీద్‌ తెలిపారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉమర్‌కోట్ నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు సోషల్ మీడియాలో దైవ దూషణతో కూడిన ఒక పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 సీ కింద ఆ డాక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు వచ్చిన తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్‌ గజరాజులు

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)