Breaking News

కశ్మీర్‌పై మళ్లీ విషం చిమ్మిన పాక్‌.. తిప్పికొట్టిన భారత్‌

Published on Thu, 11/07/2024 - 07:35

ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిలో మరోమారు కశ్మీర్‌ అంశంపై విషం చిమ్మింది. ఈ నేపధ్యంలో కశ్మీర్‌ విషయంలో పాక్‌ ఐక్యరాజ్యసమితిలో అసత్యాలను ప్రచారం చేస్తూ, ఈ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్‌ ఆరోపించింది.

అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్‌ ఉపయోగించుకుంటోందని  భారత్‌ పొరుగుదేశం పాక్‌పై దుమ్మెత్తి పోసింది. పాక్‌ ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగించినా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారబోవని భారత్ పేర్కొంది. సమాచార సంబంధిత ప్రశ్నలపై యూఎన్‌ జనరల్ అసెంబ్లీకి చెందిన నాల్గవ కమిటీ సాధారణ చర్చలో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రసంగించారు. ఒక పాకిస్తానీ ప్రతినిధి బృందం మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ఈ ప్రతిష్టాత్మక వేదికను ఉపయోగించుకున్నదని ఆయన ఆరోపించారు.

దుష్ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ప్రతినిధి బృందానికి అలవాటైందని రాజీవ్‌ శుక్లా ఆరోపించారు.  ఐక్యారాజ్య సమితిలో పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దరిమిలా శుక్లా పాక్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు.  పాక్‌ ఎన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చినా వాస్తవాలు మారవన్నారు. ఈ ఫోరమ్‌ (పాక్‌) రాజకీయ ఎజెండా కోసం కాకుండా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా,  విశ్వసనీయ సమాచారం అందిస్తూ ప్రజలను సాధికారతపరచడానికి భారత్‌ కృషి చేస్తున్నదన్నారు. 

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో నిరసనలు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)