Breaking News

ఉగ్రవాదం అంతానికి పాక్‌ ప్రధాని పిలుపు

Published on Sun, 06/23/2024 - 07:00

ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్  సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని  కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.

2014, డిసెంబర్ 16న పాక్‌లోని పెషావర్ స్కూల్‌పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్‌ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్‌లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)