Breaking News

ఉద్రిక్తంగా పాక్‌–అఫ్గాన్‌ పోరు

Published on Mon, 10/13/2025 - 05:22

ఇస్లామాబాద్‌/పెషావర్‌: తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్‌ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్‌ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్‌ ప్రకటించుకున్నాయి. 

200 మందికిపైగా తాలిబాన్‌ ఫైటర్లను అంతంచేశామని పాకిస్తాన్‌ ఆర్మీ ఆదివారం ప్రకటించగా తాము 58 మంది పాక్‌ సైనికులను చంపేశామని అఫ్గాన్‌ ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను సైతం దాడులను ధ్వంసంచేశామని అఫ్గాన్‌ సర్కార్‌ వెల్లడించింది. తమ దాడుల ధాటికి 30 మంది పాక్‌ సైనికులు రక్తమోడారని వెల్లడించింది. 

ఈ మేరకు తాలిబాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్‌ ముజాహిద్‌ మాట్లాడారు. ‘‘ మా అఫ్గాన్‌ ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారైన ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పిస్తోంది. పాక్‌లో తలదాచుకున్న ఐఎస్‌ఐఎస్‌ ముఖ్యులను మాకు అప్పగించాలి. ఐఎస్‌గ్రూప్‌ ఒక్క అఫ్గానిస్తాన్‌కే కాదు యావత్‌ ప్రపంచానికే పెనుముప్పు’’ అని ముజాహిద్‌ అన్నారు. 

సరిహద్దు వెంట కాల్పుల మోత
‘ఖైబర్‌ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌ పరిధిలోని బరా మ్చాల్లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్‌ అడ్డా, బజౌర్, కుర్రం, డిర్, చిత్రాల్‌లోని పాక్‌ ఆర్మీ పోస్ట్‌ లపై మా బలగాలు దాడులుచేశాయి. డ్యూరాండ్‌ రేఖ వెంబడి పాక్‌ పోస్ట్‌లపై తెగబడి పలువురు పాక్‌ సైనికులను చంపేశాం’ అని ముజాహిద్‌ వివరించారు. 
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి