Breaking News

Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు

Published on Sun, 02/04/2024 - 06:00

ఇస్లామాబాద్‌: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్‌ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్‌ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్‌ ఫరీద్‌ మనేకా కేసు పెట్టారు.

వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్‌ సివిల్‌ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్‌ పేర్కొంది.

తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్‌ హీలర్‌గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్‌ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు