Breaking News

పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ ధరల బాంబు

Published on Sat, 03/07/2026 - 11:37

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న  పాకిస్తాన్‌లో పెట్రో ధరల బాంబు పేలింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో తలెత్తిన ఆటంకాల నేపథ్యంలో  పాకిస్తాన్‌ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ శనివారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా 55 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తాజా పెంపుతో పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 266.17 నుంచి రూ. 321.17కు చేరింది. అంటే దాదాపు 17 శాతం మేరకు పెరిగింది. ఇక రవాణా రంగానికి కీలకమైన హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 280.86 నుంచి ఏకంగా రూ. 335.86కు (20 శాతం పెంపు) ఎగబాకింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ  వివరాలను వెల్లడించారు.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని వారు పేర్కొన్నారు. ‘పొరుగు దేశంలో రాజుకున్న నిప్పు ఇప్పడు ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల దృష్ట్యా, ఇకపై ప్రతి వారం పెట్రో ధరలను సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా పాకిస్తాన్‌కు వచ్చే చమురు రవాణాలో అధిక భాగం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధి గుండానే జరుగుతుంటుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు నౌకలను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు

#

Tags : 1

Videos

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)