Breaking News

Pakistan General Elections 2024: పాక్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు

Published on Thu, 02/08/2024 - 06:09

ఇస్లామాబాద్‌: పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్‌ఖాన్‌ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్‌ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్‌ ప్రధాని అవుతారు.

నవాజ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ పారీ్ట అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్‌ బ్యాట్‌పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు.

బుధవారమే బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌న్స్‌లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్‌స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్‌ అసెంబ్లీ(పార్లమెంట్‌) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్‌చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్‌చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)