Breaking News

లైవ్ టీవీ షోలో ఏడ్చేసిన పాక్‌ మాజీ మంత్రి.. వీడియో వైరల్..

Published on Fri, 02/03/2023 - 18:59

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ చౌదరి లైవ్ టీవీ షోలో బోరున విలపించారు. దేశద్రోహం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్‍పై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు.  తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్‌ను ప్రశ్నించారు.

తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు.

ఫవాద్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్‌ ఉద్యోగులు..

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)