Breaking News

పాకిస్తాన్‌లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!

Published on Sun, 01/18/2026 - 03:46

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లో సామాన్యులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాల లోపం కారణంగా పాకిస్తాన్‌లో గోధుమ పిండి సంక్షోభం అత్యంత తీవ్రమైంది. ఆ దేశంలోని దక్షిణ పంజాబ్ ప్రాంతంలో మొదలైన ఈ సంక్షోభంతో పేద ప్రజలు రెండు పూటల కూడా తిండి తినలేని పరిస్థితి నెలకొంది.

ప్రాంతీయ బహిరంగ మార్కెట్లలో గోధుమ ధరలు 40 కిలోలకు రూ.4,600 (పాకిస్తాన్‌ రూపాయలు) చేరగా, ఒక్క కేజీ గోధుమ పిండి దాదాపు రూ.130 లకు చేరింది. అంటే, ఒక సామాన్య కుటుంబం 10 కిలోల పిండి కోసం రూ.1,300 ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేదలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది.

మరోవైపు అక్కడి ప్రభుత్వం సబ్సిడీతో పిండి అందిస్తున్నా దాంతో సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. 10 కిలోల పిండి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.910 కాగా 20 కిలోలకు రూ.1,820. అయితే లాహోర్ వెలుపల ప్రభుత్వ పిండి లభ్యత చాలా తక్కువగా ఉంది. దక్షిణ పంజాబ్ ప్రజలు ఇప్పుడు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడాల్సి వస్తోంది.

పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. వ్యాపారులు, సామాన్య ప్రజల వద్ద గోధుమ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. సుమారు 50 లక్షల జనాభా ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో ప్రభుత్వ గోధుమల స్థిర కోటా అందుబాటులో లేకపోవడం వల్ల సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో 80 శాతం పిండి మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయని మిల్లర్లు తెలిపారు.

పెరుగుతున్న ఖర్చులు, బలహీన పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ ఉదాసీనత పరిస్థితిని మరింత తీవ్రముగా మార్చాయని మిల్లర్లు చెబుతున్నారు. పంజాబ్ ప్రభుత్వం తన 1.5 మిలియన్ టన్నుల నిల్వల నుండి జనవరి 20 నుండి మార్చి 20 వరకు రోజుకు 20,000–22,000 టన్నుల గోధుమలు విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఈ సంక్షోభం మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించారు.
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌