Breaking News

Imran Khan: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్‌

Published on Thu, 06/22/2023 - 13:49

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఇ‍మ్రాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు లాహోర్‌ యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో, ఇమ్రాన్‌ఖాన్‌ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. 

వివరాల ప్రకారం.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్‌ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్‌పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

ఈ క్రమంలో రెండు కేసుపై లాహోర్‌ యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్‌ సహా.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇ‍మ్రాన్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్‌ చేయనున్నారు. 

ఇది కూడా చదవండి: చైనా ఓవరాక్షన్‌.. భారత్‌, అమెరికాకు భంగపాటు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)