Breaking News

ఎన్నికల తంతు ముగియగానే పాక్‌లో ధరల మోత!

Published on Mon, 02/19/2024 - 07:32

పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ద్రవ్యోల్బణం దడ పుట్టించడం మొదలుపెట్టింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌తో పాటు దేశీయ వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల వెన్ను విరిగింది. 

పాక్‌లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆదివారం కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పులపాలు చేస్తున్నదని ఆందోళనకారులు వాపోయారు. 

ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తున్నదని కరాచీలో దాబా నిర్వహిస్తున్న ఇర్ఫాన్ వాపోయారు. రాబోయే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని, గ్యాస్ బిల్లులు కట్టలేకపోతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించారని, ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 12,500 (పీకేఆర్‌)కు చేరడంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నామని తెలిపారు. రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. 

రోజువారీ కూలీగా పనిచేస్తున్న అబిద్‌ మాట్లాడుతూ ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె కూడా కట్టలేక పోతున్నాం. రోజంతా కష్టపడితే కేవలం 900 పాకిస్తాన్ రూపాయలు సంపాదిస్తాను. దీంతో ఇంటి అద్దె నెలకు రూ. 7,500(పీకేఆర్‌) ఎలా చెల్లించాలని’ అబిద్‌ ప్రశ్నించారు. ఇంటి యజమానులు వంట కోసం కలపను వినియోగించడానికి అనుమతించకపోవడంతో, ఇప్పటికి కనీసం మూడు ఇళ్లు మార్చానని, వంట గ్యాస్‌ కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నానని అబిద్‌ వాపోయారు.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)