Breaking News

మునీర్‌కు మరింత ‘పవర్‌’.. పాక్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

Published on Sun, 11/09/2025 - 09:36

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రభుత్వం త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్‌ కిందికి తీసుకు వచ్చేందుకు వీలుగా ‘చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌’అనే కొత్త పోస్టును సృష్టించింది. ఇందుకోసం షెహబాజ్‌ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243లో ప్రతిపాదించిన మార్పులతో 27వ రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం సెనేట్‌లో ప్రవేశపెట్టింది.

దీని ప్రకారం.. ఆర్మీ చీఫ్‌ను, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ను ప్రధానమంత్రి సిఫారసు మేరకు అధ్యక్షుడు నియమిస్తారు. అనంతరం, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రధానితో చర్చించిన తర్వాత నేషనల్‌ స్ట్రాటజిక్‌ కమాండ్‌ అధిపతిని నియమిస్తారు. సైన్యం, వైమానిక, నౌకా దళాల మధ్య సమన్వయం కోసం సీడీఎఫ్‌ అధిపతిగా ఉంటారు. కాగా, ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్న ఆసిఫ్‌ మునీర్‌ను కొత్తగా సృష్టిస్తోన్న సీడీఎఫ్‌గా నియమించనున్నట్లు పాకిస్తాన్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే మునీర్‌కు పాక్‌ సైన్యంపై మరింత పట్టు పెరుగుతుంది. ఆయనకు మరిన్ని పవర్‌ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్‌ దాడుల కారణంగా పాకిస్తాన్‌ తీవ్రంగా నష్టపోయింది. పాక్‌ ఆర్మీకి భారత్‌ చుక్కలు చూపించింది. అనంతరం, దాడుల నుంచి తేరుకున్న పాక్‌.. తమ సైన్యంపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి కల్పించింది. తద్వారా ఆయన దేశ చరిత్రలో ఈ పదవికి ఎదిగిన రెండవ అత్యున్నత సైనిక అధికారిగా నిలిచారు. అప్పటి నుంచి‌ షెహబాజ్‌ ప్రభుత్వం మునీర్‌ను హైలైట్‌ చేస్తోంది. 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)