Breaking News

టైటాన్ జలాంతర్గామిలో మేము వెళ్ళాలి.. కానీ అదృష్టవశాత్తూ..   

Published on Sat, 06/24/2023 - 12:26

అమెరికా: అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ ల స్థానంలో తానూ తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని కానీ చివరి నిముషంలో తప్పుకోవడంతో ప్రాణాలు నిలుపుకున్నామాని అన్నారు లాస్ వేగాస్ కు చెందిన పెట్టుబడిదారుడు జే బ్లూమ్.    

జీవితంలో ఇలాంటి అనుభూతిని ఒక్కసారైనా పొందాలని, సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూడటమంటే అదృష్టముండాలని ఎలాగైనా తనను ఈ సాహస యాత్రకు ఒప్పించే ప్రయత్నం చేశారు ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ రష్. అయినా కూడా నాకెందుకో ఆ బుల్లి జలాంతర్గామి భద్రత విషయమై ఎక్కడో అనుమానం ఉండేది. రష్ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఒక హెలికాఫ్టర్లో ప్రయాణం కంటే ఇది చాలా సురక్షితమైనది చెప్పేవారు.

కానీ ఎందుకో నా మనసు అంగీకరించక నేను చివరి నిముషంలో అతడి అభ్యర్ధనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు జే బ్లూమ్. లేదంటే పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ స్థానంలో తానూ.. అతని కుమారుడు సులేమాన్ స్థానంలో 20 ఏళ్ల మా అబ్బాయి సీన్ ఉండేవారమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు బ్లూమ్. 

ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ ఎంతగా చెప్పినా కూడా బ్లూమ్ ఒప్పుకోవకపోవడానికి ఆ వాహనం రిమోట్ ఆపరేటింగ్ వాహనం కావడం కూడా ఒక కారణమని చెప్పారు జె బ్లూమ్. సొంతంగా ఒక హెలికాఫ్టర్ ఉన్న బ్లూమ్ కు టైటాన్ భద్రతా ప్రమాణాలపై చాలా అనుమానాలు ఉండేవి.

ఆరోజు నాకున్న స్పష్టమైన అవగాహన కారణంగానే నేను ఈ యాత్రకు ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామని, షాహ్జాదా దావూద్ - సులేమాన్ ఫోటోలు చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకు వస్తోందని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఈజిప్టులో మోదీ తొలి అడుగు

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)