Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌పై కాసుల వర్షం.. ఒకే ఏడాదిలో 12 వేల కోట్లకు పైగా!

Published on Fri, 01/23/2026 - 01:41

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కూడా ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తున్న ఐరోపా దేశాల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక 'ఎకనామిక్ మిరకిల్' అని ట్రంప్‌ అభివర్ణించారు. తన టారిఫ్ విధానాల వల్ల దేశంలోకి $18 ట్రిలియన్ల (సుమారు రూ. 1,512 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. 

అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాల వల్ల, అమెరికా దిగుమతిదారులు ఎక్కువ పన్ను కడుతున్నారు. దీంతో వస్తువుల ధరలు పెరిగి సామాన్య అమెరికా ప్రజలే నష్టపోతున్నారు.

ట్రంప్‌పై కాసుల వ‌ర్షం
అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే ట్రంప్ ఆస్తులే ఎక్కువ‌గా పెరిగ‌న‌ట్లు తెలుస్తోంది. న్యూయర్క్ టైమ్స్ ప్రకారం.. రెండోసారి అధ్యక్షుడైన ఆయన కేవలం ఒకే ఏడాదిలో $1.4 బిలియన్లు (సుమారు రూ. 12,810 కోట్లు) సంపాదించిన‌ట్లు స‌మాచారం. ట్రంప్ తన క్రిప్టోకరెన్సీ వెంచర్‌ల నుంచి గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించారంట‌. 

ఆయన కుటుంబానికి చెందిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్', 'మీమ్ కాయిన్'($TRUMP) ద్వారా వందల మిలియన్ల డాలర్లు వచ్చినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒమన్,సౌదీ అరేబియా, వియత్నాం వంటి దేశాల్లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టుల ద్వారా కోట్లాది రూపాయలు లైసెన్సింగ్ ఫీజుల రూపంలో ట్రంప్ 23 మిలియన్ డాలర్లు సంపాదించారని సమాచారం. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)