Breaking News

అత్యంత పురాతన మానవుల పాదముద్రలు లభ్యం

Published on Sun, 10/08/2023 - 13:46

అమెరికాలోని న్యూ మెక్సికోలో పురాతన మానవ పాదముద్రలను కనుగొన్నారు. ఇవి ఇక్కడి వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తోంది. 

ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకునేందుకు అధ్యయనంలో రెండు పద్ధతులు ఉపయోగించారు. ఈ పాదముద్రలు కనిపించిన ట్రాక్‌వేలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని  అంచనా వేశారు. అంటే అవి మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’ (26,500 నుండి 19,000 సంవత్సరాల క్రితం) కాలం నాటివి. 

13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొదటి మానవులు క్లోవిస్ ప్రజలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో భావించారు. గత కొన్ని దశాబ్దాలలో పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్‌కు పూర్వం అంటే 13 వేల సంవత్సరాల క్రితం అమెరికాలో నివసించే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే ఆయా ప్రదేశాలలో చాలా వరకు ఆధారాలు నిర్థారించే స్థాయిలో లేవు.

వైట్ సాండ్స్ ట్రాక్‌వే ఇప్పుడు ఉత్తర అమెరికాలో పురాతన మానవులకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఫలితంగా మొదటి అమెరికన్ల రాక తేదీని గణనీయంగా వెనక్కి నెట్టినట్లయ్యింది. కాథ్లీన్ స్ప్రింగర్‌తో కలిసి అధ్యయనానికి నాయకత్వం వహించిన జెఫ్రీ పిగటి మాట్లాడుతూ లాస్ట్ గ్లేసియల్ మాగ్జిమమ్ సమయంలోనే ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)