Breaking News

భూమిపై తొలి ‘శాకాహారి’.. షాకిస్తున్న సంచలనాలు!

Published on Tue, 02/17/2026 - 08:17

మనం తినే ఆహారం, మన జీవనశైలి.. ఇవన్నీ మనం అలవరచుకున్న అలవాట్లు అనుకుంటే పొరపాటే.. సుమారు 30 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపై ఒక వింత జీవి తన ‘శాకాహార’ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. కేవలం మొక్కలను, ఆకులను మాత్రమే నమిలి తింటూ బతికిన ‘టైరన్నోరోటర్’ చరిత్ర వింటే ఎవరైనా  ఆశ్చర్యపోవాల్సిందే. కెనడాలో దొరికిన ఒక చిన్న పుర్రె.. కోట్లాది ఏళ్ల నాటి జీవ పరిణామ క్రమ రహస్యాలను ఎలా బయటపెట్టిందో తెలుసుకుందాం..

జీవ పరిణామ క్రమంలో సరికొత్త అధ్యాయం
కెనడాలోని నోవా స్కోటియా ప్రావిన్స్‌లో శాస్త్రవేత్తలు 30.7 కోట్ల ఏళ్ల నాటి ఒక అరుదైన పురాతన జీవి పుర్రెను కనుగొన్నారు. ఈ జీవిని భూమిపై నివసించిన అత్యంత పురాతన శాకాహార జంతువులలో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు. ఈ ఆవిష్కరణ జీవ పరిణామ క్రమంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. టైరన్నోరోటర్‌లు మాంసాహారులుగానే ఉండేవని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. టైరన్నోరోటర్ హెబెర్టీ (Tyrannoroter heberti)గా పిలిచే ఈ జంతువులు మిలియన్ల ఏళ్ల ముందే మొక్కలను తినడం ప్రారంభించాయని స్పష్టమైంది.

భూమిపై శాకాహార జీవుల ఆధిపత్యం
పర్యావరణ వ్యవస్థపై  ప్రచురితమైన ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే మొక్కలను ఆహారంగా తీసుకునేందుకు వీలుగా శరీర నిర్మాణాన్ని మార్చుకున్న  వెన్నెముక కలిగిన భూచర జీవిగా ‘టైరన్నోరోటర్’  గుర్తింపు పొందింది. షికాగోలోని ఫీల్డ్ మ్యూజియంకు చెందిన పాలియోంటాలజిస్ట్ అర్జన్ మాన్ అభిప్రాయం ప్రకారం.. ఈ ఆవిష్కరణ భూమిపై శాకాహార జీవుల ఆధిపత్యం ఎంత పురాతనమైనదో తెలియజేస్తుంది. నేటి ఆధునిక పర్యావరణ వ్యవస్థకు పునాదులు కోట్లాది ఏళ్ల క్రితమే పడ్డాయని ఈ శిలాజం నిరూపిస్తోంది.

ప్రత్యేకమైన ముక్కుతో..
ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన హిల్లరీ మాడిన్ వివరణ ప్రకారం ఈ జీవి సుమారు ఒక ఫుట్‌బాల్ పరిమాణంలో ఉండేది. దీని శరీర నిర్మాణం చాలా విచిత్రంగా, పటిష్టంగా ఉండటమే కాకుండా, భూమిపై నివసించడానికి అనువైన లక్షణాలను కలిగి ఉండేది.మొక్కలను కోయడానికి ప్రత్యేకమైన ముక్కు ఉండటం దీని ప్రత్యేకత. ఈ విలక్షణమైన ఆకారం వల్ల నేలపై ఉండే చిన్న చిన్న మొక్కలను సులభంగా కోయడానికి దానికి వీలయ్యేది. ఆహార సేకరణలో ఇతర జీవుల కంటే ఇది భిన్నమైన నైపుణ్యాన్ని ప్రదర్శించేదని పరిశోధకులు భావిస్తున్నారు.

‘డెంటల్ బ్యాటరీస్’ మరో స్పెషల్‌
ఈ జీవి నోటిలో పైభాగం, కింది దవడలలో దంతాలు ఒకదానికొకటి సరిగ్గా సరిపోయేలా అమరి ఉన్నాయి. ‘డెంటల్ బ్యాటరీస్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన అమరిక, ఇది కచ్చితంగా మొక్కలను నమిలి తినే శాకాహారి అని ధృవీకరిస్తోంది. మొక్కలను అరిగించుకోవడానికి అవసరమైన శక్తివంతమైన కండరాలను కూడా ఇది కలిగి ఉండేది. ‘టైరన్నోరోటర్’ శిలాజానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధ్యయనం చేసేందుకు పరిశోధకులు 3D స్కానింగ్, ప్రింటింగ్ సాంకేతికతను వినియోగించారు. దాని ప్రతిరూపాలను తదుపరి పరిశోధనల కోసం అందుబాటులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి: భూమిపైకి ఏలియన్స్‌.. ఒబామా వ్యాఖ్యల కలకలం!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)