Breaking News

ఎర్రసముద్రంలో అలజడి.. మరో రెండు నౌకలపై డ్రోన్ దాడి

Published on Sun, 12/24/2023 - 13:23

ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్‌దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే  దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేశారని వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు.  

అయితే.. భారత జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ పొరపాటున ఇంతకుముందు తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత భారత నౌకాదళం తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబాపై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు.  

అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ లబూన్‌ పై కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ డ్రోన్ల్‌ను యుద్ధనౌక కూల్చివేసిందని అమెరికా సెంట్‌కామ్‌ వెల్లడించింది. ఈ ఘటనల తర్వాత అక్టోబర్‌ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది.

ఓవైపు గుజరాత్ సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  యెమెన్‌లో కేంద్రీకృతమైన ఇరాన్ మద్దతుగల హౌతీలు.. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. బాబ్ అల్-మందాబ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నారు. 

ఇదీ చదవండి: డ్రోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందంటే..


 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)