‘ఆకలి చావులను అరికట్టండి’: గాజా పరిస్థితులపై ఒబామా ఆవేదన

Published on Mon, 07/28/2025 - 09:25

గాజా: గాజా స్ట్రిప్‌లో అంతకంతకూ పెరుగుతున్న మానవతా సంక్షోభం మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గాజాలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. ఇజ్రాయెల్‌ బందీలను వెనక్కి తీసుకురావడం, ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం జరగాలని ఒబామా పేర్కొన్నారు.  ఆకలితో అక్కడి అమాయక ప్రజలు చనిపోతున్నారని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా  పేర్కొన్నారు.

గాజా స్ట్రిప్‌లోని బాధితులను కలుసుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు అనుమతులు ఉండాలన్నారు. వారికి ఆహారం, నీటిని దూరంగా  ఉంచడం సమర్థనీయం కాదన్నారు. మరోవైపు గాజాలో పోషకాహార లోపం ఆందోళనకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) ఆదివారం హెచ్చరించింది. వారికి అందే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిరోధించడం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ  ఏడాది నమోదైన 74 పోషకాహార లోపం మరణాలలో 63 జూలైలో సంభవించాయి. ఇందులో 24 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు.
 

ప్రపంచ ఆరోగ్య  సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, గాజాలో దాదాపు ఐదుగురు పిల్లలలో ఒకరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆహార నిపుణులు కూడా గాజాలో కరువు పరిస్థితులపై ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇక్కడి జనాభాకు సహాయం అందించడంపై ఇజ్రాయెల్ పరిమితులు విధించింది. కాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాలోని మూడు ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ విరామం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఉంటుందని ఇజ్రాయెల్‌ తెలిపింది.
 

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)