Breaking News

ఆస్పత్రిలో నర్సు.. అందాల తార!

Published on Tue, 01/20/2026 - 02:48

ఆమె ఓ నర్సు. కాదు కాదు ‘అందాల నర్సు’! కలలు అందరూ కంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. కువైట్‌లో నర్సుగా పనిచేస్తున్న బినీషాది అలాంటి ‘అందమైన’ కథే.

కేరళకు చెందిన బినీషాకు డ్యాన్స్, మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ పోషణ కోసం నర్సింగ్‌ వృత్తిని ఎంచుకుంది. కానీ ఆమె తన కలలను వదలలేదు. స్టాఫ్ నర్సుగా పని చేస్తూనే.. నృత్యం, మోడలింగ్‌లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు 2023లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను సాధించడం ద్వారా లభించింది.

ఇటు నర్సింగ్‌.. అటు మోడలింగ్‌
ఆరోగ్య సంరక్షణ బినీషా జీవితంలో ఒక భాగం. మోడలింగ్, డ్యాన్సింగ్ ఇతర పార్శ్వాలు. ఈ రెండు ప్రపంచాలను సమానంగా కొనసాగించడం ఆమె ప్రత్యేకత. బినీషా తన తండ్రి బాబు కుటుంబం కోసం పడిన కష్టాలను చూస్తూ పెరిగింది. పాఠశాల రోజుల నుంచే కళలపై ఆసక్తి చూపుతున్న కుమార్తె కలలను తల్లి షీలా ఎంత గానో ప్రోత్సహించింది. పాఠశాల కళల వేదికపై మెరిసినప్పటికీ, కళతో జీవితాన్ని సాగించడం కష్టమని గ్రహించిన బినీషా, వృత్తిపరమైన కోర్సు వైపు మొగ్గు చూపింది. అలా నర్సింగ్ చదివి పూర్తి చేసింది.

చదువు పూర్తయ్యాక, నాలుగేళ్ల పాటు ఐసీయూ నర్సుగా పనిచేసింది. అదే సమయంలో, గ్లామ్ గైడెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2023 పోటీలో కేరళకు ప్రాతినిధ్యం వహించిన బినీషా.. దాదాపు 40 మంది పోటీదారుల దాటుకుని టైటిల్ గెలిచింది. ఇప్పుడు తన సోదరి అలీషా చదువులను కూడా బినీషానే చూసుకుంటోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)