నిజమవుతున్న నోస్ట్రాడమస్, బాబా వంగా హెచ్చరికలు?

Published on Mon, 02/17/2025 - 11:19

న్యూఢిల్లీ: భూకంపం.. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోతున్న ఒక ప్రకృతి విపత్తు. కొన్ని వేల ఏళ్లుగా భూకంపాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 17)న దేశరాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయకంపితులను  చేసింది. అయితే భవిష్యత్‌ అంచనాల గురించి తెలిపిన నోస్ట్రాడమస్, బాబా వంగా భూకంపాలు, ప్రకృతి విపత్తులపై ఎటువంటి హెచ్చరికలు చేశారు?

నోస్ట్రాడమస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల  గురించి తెలిపేవాడు. భూమి కంపించటం, నదులు ఉప్పొంగటం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలను ముందుగానే తెలియజేశాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని నోస్ట్రాడమస్ ముందుగానే తెలిపాడు. ఈయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రాడమస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి  గురించి రాశాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం  మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని నోస్ట్రాడమస్ పేర్కొన్నాడు.

2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడమస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సూడాన్‌లో కరువు, పరిమిత సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి మానవతా సంక్షోభం ఎదురవుతుందన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది.

బాబా వంగా 2025లో సంభవించే విపత్తుల గురించి కొన్న అంచనాలు అందించారు. యూరప్‌లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ ఖండంలోని  అధిక జనాభా నాశనమవుతుంది. బాబా వంగా జోస్యం ఒకవేళ నిజమైతే 2025లో రష్యా.. ప్రపంచాన్నంతటినీ శాసిస్తుంది. బాబా వంగా చెప్పినదాని ప్రకారం 2025లో అమెరికా పశ్చిమ తీరంలో భూకంపం వస్తుంది. పలు అగ్నిపర్వతాలు  పేలే అవకాశాలున్నాయి. నోస్ట్రాడమస్ 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. అతని అంచనాలు కొన్ని శతాబ్దాలుగా నిజమవుతున్నాయి. బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన  9/11 దాడి, యువరాణి డయానా మరణం లాంటి అంచనాలు నిజమయ్యాయి.

ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)