Breaking News

రష్యాకు ‘కిమ్‌’ బలగాలు.. ‘సియోల్‌’ ఆగ్రహం

Published on Wed, 10/23/2024 - 18:51

సియోల్‌: ఉత్తర కొరియా తాజాగా మరో పదిహేను వందల మంది తమ సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్‌ఐఎస్‌) వెల్లడించింది. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు ఎన్‌ఐఎస్‌ చీఫ్‌ యంగ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసమే వారిని పంపిందని పేర్కొన్నారు. డిసెంబర్‌ నాటికి మరో 10 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని  ఉత్తరకొరియా యోచిస్తోందన్నారు.

ఇప్పటికే  ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మంది సైనికులను పంపినట్లు ఎన్‌ఐఎస్‌ తేల్చిచెప్పింది. రష్యా యుద్ధ నౌకల్లో 1500 మందితో కూడిన ఉత్తరకొరియా ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్తోక్‌ పోర్టుకు చేరుకున్నాయని ఎన్‌ఐఎస్‌ తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జి జినోవిచ్‌తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్‌ కిమ్‌ హాంగ్‌ క్యూన్‌ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు. 

ఉత్తర కొరియాతో తమ సంబంధాలు దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని రష్యా రాయాబారి స్పష్టం చేశారు. అయితే ఉత్తర కొరియా చర్యలు ఇలానే ఉంటే తాము ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు పంపుతామని సౌత్‌ కొరియా హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియా ఒక క్రిమినల్‌ దేశమని ఫైర్‌ అయింది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మధ్య మంచి సంబంధాలున్నాయి. కిమ్‌కు ఇటీవల పుతిన్‌ ఖరీదైన బహుమతులను కూడా ఇవ్వడం గమనార్హం. 

ఇదీ చదవండి:  ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ ప్రమాదకరం: జో బైడెన్‌  

Videos

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)