Breaking News

నార్త్‌ కొరియా మిసైల్స్ ప్రయోగం

Published on Sun, 01/04/2026 - 18:43

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తరకొరియా జపాన్‌ భూభాగంలో బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా జపాన్ అప్రమత్తమైంది. అత్యవసరంగా సమవేశమై హెచ్చరికలు జారీ చేసింది. 

జపాన్ మీడియా కథనాల ప్రకారం.. జపాన్ సముద్ర తీరం నుండి 200 మైళ్ల దూరం వరకూ ఆ దేశానికి చెందిన జలాలుగానే పరిగణిస్తారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు జపాన్ భూభాగంలో పడ్డాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కోయిజుమి తెలిపినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఆ క్షిపణులు దాదాపు 950 కిలోమీటర్ల పాటు ప్రయాణించాయని తెలిపాయి. అమెరికా, జపాన్ దేశాలకు సంబంధించిన కీలకమైన రక్షణ స్థావరాలతో పాటు దక్షిణ జపాన్‌లోని చాలా ప్రాంతాలను అవి చేరగలవని ఆయన తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ హెచ్చరిక జారీ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.

‍అయితే నార్త్ కొరియా ఇదివరకే జపాన్ మీదుగా తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయంలో ఇది వరకే జపాన్ ఎన్నో సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా అమెరికాకు చెందిన కీలకమైన సైనిక స్థావరాలు జపాన్‌లో ఉన్నాయి. యుఎస్,నార్త్‌కొరియాకు అస్సలు పొసగదు. దీంతో జపాన్‌తో కూడా ఆ దేశం దూరంగా ఉంటుంది.

అయితే వెనిజులాపై అమెరికా దాడిని నార్త్‌ కొరియా తీవ్రంగా ఖండించింది. ఈదాడి అమెరికా క్రూర స్వభావాన్ని మరోసారి తేటతెల్లం చేసిందని అక్కడి ప్రభుత్వవర్గాలు వ్యాఖ్యానించాయి.

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)