ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణుల ప్రయోగం 

Published on Mon, 01/05/2026 - 06:32

సియోల్‌: ఉత్తర కొరియా ఆదివారం తన తూర్పు ప్రాంత సముద్ర జలాల మీదుగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు ధ్రువీకరించాయి. ఉత్తర కొరియా ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో పలు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సముద్ర జలాల్లో పడిపోయాయంది. 

ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు వివరించింది. ఉత్తరకొరియా ఆదివారం కనీసం రెండు బాలిసిŠట్‌క్‌ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్‌ ధ్రువీకరించింది. ఉత్తరకొరియా చర్యలు తమ దేశానికి, ఈ ప్రాంతానికేకాదు, ప్రపంచానికే బెడదగా పరిణమించాయని పేర్కొంది. భద్రతా మండలి తీర్మానాలకు లోబడి, బాలిస్టిక్‌ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని, తమతో చర్చలకు ముందుకు రావాలని, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు తోడ్పడాలని దక్షిణ కొరియా పిలుపునిచి్చంది. 

ఇలా ఉండగా, ఈ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉత్తరకొరియా అధికార కమ్యూనిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కిమ్‌ ప్రభుత్వం మారనున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలను చేపట్టి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. గతవారం దీర్ఘశ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్‌ మిస్సైళ్లను ప్రయోగించిన కిమ్‌ సైన్యం, అంతకుముందు నిర్మాణంలో ఉన్న అణు జలాంతర్గామికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. దీంతోపాటు, ఒక వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిగిన పక్షంలో పైచేయి సాధించేందుకు సైతం కిమ్‌ వీటిని ఉపయోగించుకునే వ్యూహం కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. 

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌ చైనా పర్యటనకు బయలుదేరటానికి కొద్ది గంటల ముందు కిమ్‌ యంత్రాంగం బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలను చేపట్టడాన్ని కూడా పరిశీలకులు కీలక పరిణామంగానే భావిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా లీ జే మ్యుంగ్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన, ఉత్తర కొరియా ఆయుధ పాటవాన్ని పెంచుకోవడంపై అభ్యంతరం తెలపడంతోపాటు, ఆ దేశాన్ని చర్చలకు ఒప్పించాలని కోరే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. శనివారం సియోల్‌ సమీపంలోని ఆయుధ కాంప్లెక్స్‌ను సందర్శించిన కిమ్‌.. ఆయుధాల ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచాలని అధికారులను ఆదేశించినట్లు అధికార మీడియా తెలిపింది. వెనెజువెలా రాజధాని కారకాస్‌పై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని అమెరికా పట్టుకెళ్లి జైలులో వేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.  
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)