Breaking News

కిమ్‌ జోంగ్‌కు ఇన్సోమ్నియా డిజార్డర్‌!

Published on Thu, 06/01/2023 - 09:23

ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అరోగ్య పరిస్థితి గురించి మరో కథనం తెరపైకి వచ్చింది. ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడని, ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరి ఆయన ప్రాణం మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదంటూ బ్లూమ్‌బర్గ్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ లాంటి ప్రముఖ మీడియా హౌజ్‌లలో కథనాలు పబ్లిష్‌ అయ్యాయి. 

దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌(NIS) రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా అధికారులు ఇన్సోమ్నియా(నిద్రలేమి)కు సంబంధించి విదేశీ మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌ను.. ప్రత్యేకించి జోల్పిడెమ్‌ లాంటి మందులకు సంబంధించిన సమాచారం కోసం తెగ వెతికేస్తున్నారట. 

ఎన్‌ఐఎస్‌ నివేదిక వివరాలను సౌత్‌ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్‌ కమిటీ కార్యదర్శి యూ సాంగ్‌ బూమ్‌ మీడియాకు వెల్లడించారు.  ఇన్సోమ్నియా ఉత్తర కొరియాను కలవరపెడుతోంది. అక్కడి పెద్ద తలకాయ ఆ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం మాకు ఉంది. అంతేకాదు.. దాని ట్రీట్‌మెంట్‌, మందుల సమాచారం కోసం విదేశీ వైద్యవిధానాల గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారని తేలింది. 

వీటితో పాటు తాజాగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బయట కనిపించిన కొన్ని ఫొటోలను అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ద్వారా పరిశీలించాం. అందులో ఆయన మళ్లీ విపరీతంగా బరువు పెరిగినట్లు స్పష్టమైందని బూమ్‌ తెలిపారు. వీటితో పాటుగా.. విదేశాల నుంచి మల్బరో, డన్‌హిల్‌ లాంటి విదేశీ బ్రాండ్‌ సిగరెట్లను, ఆల్కాహాల్‌తో పాటు తినే చిరు తిండ్లను ఉత్తర కొరియా విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. 

అతిగా మద్యం, ధూమపానం వల్ల కిమ్‌ ఆరోగ్యం దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 140 కేజీల బరువునకు ఆయన చేరినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్లీపింగ్‌ డిజార్డర్‌ ఇన్సోమ్నియా ఆయన్ని వేధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే 16వ తేదీన ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు ఆయన కోసం జోల్పిడెమ్‌లాంటి మందుల్ని సైతం సేకరిస్తున్నట్లు సమాచారం ఉంది అని సదరు నివేదిక సారాంశాన్ని ఆయన వివరించారు. 

ఇదిలా ఉంటే.. నార్త్‌ కొరియాలో ఆహార కొరత కారణంగా.. ఆహార ధాన్యాల ధరలకు రెక్కలు వచ్చిందని, కిమ్‌ అధికారంలోకి చేపట్టాక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూ వస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రజల ఆకలిని పట్టించుకోకుండా.. విలాసాలు, హైప్రొఫైల్‌ పార్టీలతో కిమ్‌ కుటుంబం జల్సాలు చేస్తోందన్న విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: నిద్ర లేమి ఎంత ప్రమాదకరమంటే..

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు