Breaking News

ట్రంప్‌తో పోరుకు రెడీ.. నార్త్‌ కొరియా కిమ్‌ సంచలన నిర్ణయం!

Published on Mon, 11/18/2024 - 10:46

ప్యాంగ్‌యాంగ్‌: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్‌ కొరియా అధికారులకు కిమ్‌ ఆదేశాలు జారీ చేశారు. కిమ్‌ ఆర్ఢర్‌తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్‌ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్‌ ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్‌ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్‌తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.

మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్‌ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్‌ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.

ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో జెలెన్‌ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్‌ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్‌ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్‌కు సహకరిస్తోందన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)