Breaking News

లాక్‌డౌన్‌లో ఉత్తర కొరియా..కానీ కోవిడ్‌ గురించి మాత్రం కాదట!

Published on Wed, 01/25/2023 - 16:47

ఉత్తర కొరియాలో ఏ ఘటన అయినా హాట్‌ టాపిక్‌గానూ,  సంచలనంగానూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ తీసుకునే నిర్ణయాలు చాలా విభిన్నంగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఉత్తర కొరియా వార్తల్లో నిలుస్తుంటోంది. ఇప్పుడు తాజగా మరోసారి లాక్‌డౌన్‌ విషయమై వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌ సుమారు ఐదు రోజులు పూర్తి లాక్‌డౌన్‌లో ఉంది. కానీ కరోనా మహమ్మారీ గురించి మాత్రం కాదని తెగేసి చెబుతోంది.

తమ ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారని, అందుకు సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించామని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు ఆదివారం వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతిరోజు శరీర ఉష్ణోగ్రతలు గురించి నివేదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే అక్కడే ప్రజలు ఈ నోటీసులు రాకమునుపే ముందస్తుగా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం విశేషం.

ఉత్తరకొరియా ప్రజలకు జారీ చేసిన నోటీసుల్లో ప్రజల్లో చాలమంది తీవ్రమైన జలుబుతో కూడా బాధపడుతున్నట్టు సమాచారం. కానీ కోవిడ్‌ సంబంధించిన కేసుల గురించి మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. గతేడాదే తొలిసారిగా ఉత్తర కొరియా కోవిడ్‌ కేసులు గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆగస్టు నాటికే తాము కోవిడ్‌పై విజయం సాధించామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాలోని శ్రామిక ప్రజలందరూ ఇప్పటికే స్వచ్ఛందంగా నిబంధనలను పాటిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

(చదవండి: విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)