Breaking News

ఆస్పత్రిలో చేరిన నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మదీ

Published on Mon, 10/28/2024 - 11:48

దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా  అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది.  

మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్‌లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.

నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆమె  ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు. 

ఇది కూడా చదవండి: స్పెయిన్‌ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్‌ షో

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)