Breaking News

అణ్వాయుధ వ్యతిరేక పోరాటానికి నోబెల్‌ శాంతి బహుమతి

Published on Fri, 10/11/2024 - 15:17

ఒస్లో: అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్న జపాన్‌ సంస్థ ‘నిహాన్‌ హిడాన్‌క్యో’కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్‌ కమిటీ చైర్మన్‌ వాట్నే ఫ్రైడ్నెస్‌ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని నిషేధించాలన్న నినాదం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. 

మానవాళి సంక్షేమం కోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గళం విప్పాలని సూచించారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేపట్టిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన పౌరులు ‘నిహాన్‌ హిడాన్‌క్యో’ను స్థాపించారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 

అమెరికా దాడిలో క్షతగాత్రులు మారిపోయి, బాధాకరమైన జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ శాంతి కోసం కృషి చేస్తున్నారని నిహాన్‌ హిడాన్‌క్యో సభ్యులను వాట్నే ఫ్రైడ్నెస్‌ ప్రశంసించారు. తమ సంస్థకు నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల నిహాన్‌ హిడాన్‌క్యో హిరోíÙమా శాఖ చైర్‌పర్సన్‌ తొమొయుకి మిమాకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాం’ అని  వ్యాఖ్యానించారు.  

ఏమిటీ నిహాన్‌ హిడాన్‌క్యో?  
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 9న జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో ఏకంగా 70 వేల మంది మరణించారు. మూడు రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును అమెరికా ప్రయోగించింది. ఈ ఘటనలో 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారు. దాంతో 1945 ఆగస్టు 15న పశి్చమ దేశాల సైన్యం ఎదుట జపాన్‌ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. నాగసాకి, హిరోíÙమాపై జరిగిన అణుబాంబు దాడుల్లో వేలాది మంది క్షతగాత్రులయ్యారు. 

అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారారు. బాధితులంతా(హిబకుషా) తమకు ఎదురైన అనుభవాలతో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భవిష్యత్తు తరాలను కూడా ఆదుకోవాలని, అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్‌ చేస్తూ 1956లో నిహాన్‌ హిడాన్‌క్యో సంస్థను స్థాపించారు. పసిఫిక్‌ ప్రాంతంలో అణ్వాయుధ ప్రయోగాలతో బాధితులుగా మారినవారు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)