వచ్చే ఐదేళ్లలో ఎండ ప్రచండం! హెచ్చరించిన డబ్ల్యూఎంఒ

Published on Thu, 05/18/2023 - 03:24

జెనీవా:  వచ్చే అయిదేళ్ల పాటు ప్రపంచ దేశాల్లో ఎండలు దంచికొడతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) హెచ్చరించింది. పరిమితికి మించి గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదల, ఎల్‌నినో ప్రభావంతో అయిదేళ్ల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

2015లో జరిగిన పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దానిని అధిగమించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. 2015–2022 వరకు వరసగా ఎనిమిదేళ్లు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వచ్చే ఐదేళ్లలో మరింత పెరిగిపోతాయని తెలిపింది.

‘‘వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది లేదంటే అయిదేళ్ల సగటు ఉష్ణోగ్రతలు పారిస్‌ ఒప్పందాన్ని అధిగమించేలా  1.5 డిగ్రీలు పెరిగిపోతాయి. అలా పెరగడానికి 98% అవకాశాలున్నాయి’’ అని డబ్ల్యూఎంఒ చీఫ్‌ పెటరి టాలస్‌ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ పారిస్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఎల్‌నినో పరిస్థితులతో ఈ ప్రమాదం ముంచుకొస్తోందని తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం, ఆహారం, నీటి పర్యవేక్షణ, పర్యావరణంపై ప్రభావం కనిపిస్తుందన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)