New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్‌ ప్రధాని

Published on Fri, 03/14/2025 - 13:08

భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ  వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని  చూడవచ్చు.

ఈ వీడియోను న్యూజిలాండ్‌(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి.  ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు.
 

వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్‌పై హ్యాపీ హోలీ అని రాసివుంది.  కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)