Breaking News

పేరాయణం!

Published on Thu, 10/16/2025 - 06:37

ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్‌ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్,  నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం. కానీ, లారెన్స్‌ వాట్కిన్స్‌  అనే న్యూజిలాండ్‌ మాజీ సెక్యూరిటీ గార్డ్‌కి మాత్రం  ఆ విధానం అస్సలు నచ్చలేదు!

 పేరు కాదది.. అష్టాదశ పురాణం!
ఆయన పేరంటే పేరు కాదు, అదొక అష్టాదశ పురాణం! మొత్తం 2,253 పదాలు ఉంటాయిట! గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా ‘ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగత పేరు’.. అని అధికారికంగా ప్రకటించింది. అంటే.. ఆయన తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. మీరు ఒక కాఫీ తాగి రావచ్చు. ఓ రెండు చిన్న కవితలు రాసి ముగించవచ్చు. పక్కన ఉన్న స్నేహితుడితో ఓ దేశ రాజకీయాల గురించి చర్చ మొదలెట్టి ముగించవచ్చు కూడాను.. మీరు టిఫిన్‌ చేయడం పూర్తయ్యేలోపు కూడా ఆయన పేరు సగం కూడా పూర్తి కాదు మరి! 

పెళ్లి మండపంలోనూ అదే హంగామా!
1991లో లారెన్స్‌ వాట్కిన్స్‌ మొదటి పెళ్లప్పుడు జరిగింది మరింత కామెడీ. ఆ పెళ్లి తంతు జరిపించే వ్యక్తి తెలివైన వాడు. రిస్క్‌ తీసుకోకుండా, లారెన్స్‌ గారి ఆ 2,253 పేర్ల లిస్ట్‌ను ముందుగానే రికార్డ్‌ చేశాడట!. మండపంలో మంగళవాయిద్యాల బదులు ఆ రికార్డింగ్‌ అర్ధగంట పాటు మోగుతూనే ఉందట!. అక్కడికి వచ్చిన అతిథులు షాంపైన్‌ తాగుతూ, ఆ అనంతమైన నామస్మరణను వింటూ హాయిగా తిరిగారట!.

 ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత, నామకరణ ఘట్టం ముగిశాక, ‘ఐ డూ’ అనే ముఖ్యమైన మాట చెప్పడానికి లారెన్స్‌ గారికి అవకాశం దొరికింది! ఆయన చిన్నప్పుడు ’రిప్లీస్‌ బిలీవ్‌ ఇట్‌ ఆర్‌ నాట్‌’ షో చూసి, గిన్నిస్‌ రికార్డ్స్‌ పుస్తకాలు చదివి, ‘నాలాంటి సాధారణ మనిషికి ఏ ప్రత్యేక ప్రతిభ లేదు’ అని బాధపడిపోయాడట. అప్పుడు, తనకున్న ఏకైక అవకాశం.. ప్రపంచంలోనే అతి పొడవైన పేరు పెట్టుకోవడమే అని డిసైడ్‌ అయ్యారు!

సంతకం సంగతేంటి?
రోజువారీ అవసరాల కోసం, ఆయన తన పేరును కేవలం ’లారెన్స్‌ అలోన్‌ అలోయ్‌ వాట్కిన్స్‌’ అని కుదించుకుని, సంతకాన్ని వాట్కిన్స్‌–5 (అయిదో తరం) అని పెడతారట. ఆయన పూర్తి పేరుతో ఉన్న పాత పాస్‌పోర్ట్‌కి ఏకంగా ఆరు అదనపు పేజీలు అవసరమయ్యాయట! 

ఇదే లారెన్స్‌ గారి పూర్తి పేరు
లారెన్స్‌ అలోన్‌ అలాయిస్‌ అలోయిసియస్‌ ఆల్ఫెజ్‌ అలున్‌ అలురెడ్‌ ఆల్విన్‌ అల్యాసాండిర్‌ ఆంబీ ఆంబ్రోస్‌ ఆంబ్రోసియస్‌ అమియాస్‌ అమియోట్‌ అమియాస్‌ అండర్స్‌ ఆండ్రీ ఆండ్రియా ఆండ్రియాస్‌ ఆండ్రూ ఆండీ అనైరిన్‌ ఆంగ్విష్‌ ఆన్లెయిఫర్‌ ఆంథిన్‌... (ఓస్‌.. ఇంతేనా అనుకున్నారు కదూ.. అయిపో లేదు.. ఇంకా ఉంది..)

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి