Breaking News

3 నిమిషాలు మించి హత్తుకోకండి

Published on Sun, 10/20/2024 - 05:56

వెల్లింగ్టన్‌: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.

 ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్‌ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్‌ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్‌ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్‌ సీఈఓ డేనియర్‌ బోనో సమర్థించుకున్నారు.

 ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్‌ ‘ఆక్సిటాసిన్‌’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

 డ్రాప్‌ జోన్‌ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. 

‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్‌ అండ్‌ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్‌ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్‌ ఎయిర్‌పోర్ట్‌ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది.  
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)