Breaking News

సైనిక చర్యలు శాంతిని ఇవ్వలేవు

Published on Fri, 10/16/2026 - 14:48

‘న్యూయార్క్‌ టైమ్స్‌’ జర్నలిస్ట్‌ లూలు గార్సియా–నవారో, ‘రెడ్‌ క్రాస్‌ అంతర్జాతీయ కమిటీ’ అధినేత మిర్జానా స్పొల్జారిక్‌ మధ్య జరిగిన ఈ సంభాషణలో... ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం పట్ల స్పొల్జారిక్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక చర్యల కంటే తక్షణ రాజకీయ చర్చలు, నియమాల పాటింపు మాత్రమే శాశ్వత శాంతిని తీసుకురాగలవని ఆమె అన్నారు. ముఖ్యాంశాలు 

‘యుద్ధాల దశాబ్దం’లో జీవిస్తున్నాం
‘‘మనం యుద్ధాల దశాబ్దంలో జీవిస్తున్నామని మ రింత మంది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సాయుధ పోరాటాలు అపరిమితంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలలో ఘర్షణ అనేది ఒక సాధారణ విషయంగా మారినప్పుడు, హింసను సాధారణ విషయంగా స్వీకరించే ప్రమాదం ఏర్ప డుతుంది. యుద్ధ నియమాలు ఎంత ముఖ్యమైనవో చెప్పడానికి ఇది సరైన కారణమని నేను నమ్ముతు న్నాను. యుద్ధంలో హద్దులు విధించడానికి, అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా మానవులను రక్షించడానికి ‘అంతర్జాతీయ మానవతా చట్టం’ ఉనికిలో ఉంది. రాజ కీయ, సైనిక ప్రయోజనాల కోసం ఈ సూత్రాలను పక్కన పెట్టడానికి లేదా ఐచ్ఛికంగా  మార్చడానికి మనం అనుమతించ కూడదు. 

గాజాలో కళ్లారా చూసిన విషాదం
‘‘గాజాలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, చేతులో లేదా కాళ్లో కోల్పోయిన చిన్నారులను, హింస వల్ల జీవితాలు నాశనమైన కుటుంబాలను నేను చూసి నప్పుడు... యుద్ధం వెనుక ఉన్న భయంకరమైన మానవ విషాద వాస్తవం నా కళ్లముందు నిలుస్తుంది. శాంతికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించటం, పౌరులను రక్షించడం, అత్యవసరంగా అవసరమైన వారికి మాన వతా సాయం అందేలా చూడటం రాజకీయ నాయకుల ప్రాథమిక బాధ్యత. ఇటువంటి మానసిక వేదనకు అల వాటుపడిపోవడం గానీ, లేదా దీనిని యుద్ధ పర్యవసాన అనివార్యమైన ఫలితంగా అంగీకరించడం గానీ మనం చేయకూడదు. 

ఇదీ చదవండి: కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు

పరిష్కరించేవి రాజకీయ నిర్ణయాలే
‘‘సైనిక చర్య యుద్ధభూమిలోని పరిస్థితిని మార్చ వచ్చు, ప్రత్యర్థిని బలహీనపరచవచ్చు లేదా అధికార సమతుల్యతను మార్చవచ్చు, కానీ అసలు ఘర్షణకు కారణమైన రాజకీయ విభేదాలను అది స్వయంగా పరి ష్కరించలేదు. అంతిమంగా, శాంతి అనేది ఒక రాజకీయ నిర్ణయం. యుద్ధాన్ని కొనసాగించడం వల్ల తమ సొంత ప్రజలకు, భావితరాలకు కూడా అపారమైన నష్టం జరుగుతుందనే విషయాన్ని నాయకులు గుర్తించాలి. పరస్పర నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు, ఇరుపక్షాల మధ్య విభేదాలను పరిష్కరించడం అసాధ్యమనిపించి నప్పుడు కూడా చర్చలు జరపడానికి ఓపిక, ధైర్యం, నిబద్ధత అవసరం. 
- ఎడిటోరియల్‌ టీమ్‌

పాడ్‌కాస్ట్‌: ‘ది ఇంటర్వ్యూ’న్యూయార్క్‌ టైమ్స్‌
అతిథి: మిర్జానా స్పొల్జారిక్‌ రెడ్‌ క్రాస్‌ అంతర్జాతీయ కమిటీ అధినేత
హోస్ట్‌ :లూలు గార్సియా నవారో; బ్రిటిష్‌–అమెరికన్‌ జర్నలిస్ట్, న్యూయార్క్‌ టైమ్స్‌ పాడ్‌కాస్టర్‌  
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)