Breaking News

యెమెన్‌పై మరోమారు అమెరికా దాడి

Published on Tue, 03/18/2025 - 07:02

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా(America) మరోమారు యెమెన్ పై దాడి చేసింది. ఈ దాడిని హౌతీ మీడియా ధృవీకరించింది. దీనికిముందు కూడా అమెరికా యెమెన్‌పై దాడికి పాల్పడింది.  ఆ దాడిలో 54 మంది మృతి చెందారు. తాజాగా సోమవారం యెమెన్‌పై అమెరికా మరోమారు దాడికి దిగింది. ఈ దాడిలో ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.

యెమెన్ రాజధాని సనా(Yemen's capital Sanaa)లో రాత్రిపూట అమెరికా జరిపిన దాడుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 53 మంది మృతిచెందారు. హౌతీలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకు సంఘీభావం ప్రకటిస్తూ అంతర్జాతీయ నౌకలపై దాడి చేసే తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.
 

యెమెన్ రాజధాని సనా, ఇతర ప్రాంతాలలో అమెరికా జరిపిన అనేక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యెమెన్‌లోని అనేక లక్ష్యాలపై అమెరికా రాత్రిపూట వైమానిక దాడులు నిర్వహించింది. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై హౌతీలు దాడులను ఆపాలని ట్రంప్(Trump) కోరారు. లేనిపక్షంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వారు దాడులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

ఇరాన్ మద్దతుగల మిలీషియాలు అంతర్జాతీయ షిప్పింగ్‌పై దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో  పేర్కొన్నారు. హౌతీ యోధులు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు నౌకలను ముంచేశారు. గత 18 నెలల్లో హౌతీలు అమెరికా నావికాదళంపై 174 సార్లు ప్రత్యక్షంగా దాడి చేశారని, గైడెడ్ ప్రెసిషన్ యాంటీ-షిప్ ఆయుధాలను ఉపయోగించి, 145 సార్లు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Amritsar: ఆలయంపై గ్రనేడ్‌ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)