నేపాల్‌ తాత్కాలిక ప్రధాని కర్కీ సంచలన ప్రకటన

Published on Sun, 09/14/2025 - 13:29

ఖాట్మాండ్‌: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ప్రధాని సుశీలా కీలక వ్యాఖ్యలు చేశారు.  ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. నేపాల్‌లో నిరసనలు, ఆందోళనల వేళ ప్రభుత్వ ఆస్తు​లను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని తెలిపారు. ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంట్‌కు బాధ్యతలను అందిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాం. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు. ఇక, ఈరోజు తాత్కాలిక ప్రభుత్వంలో కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉంది.

ఇదే సమయంలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారు. అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికే తాము వచ్చినట్టు వెల్లడించారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

నేపాల్ ప్రధాని సుశీల కర్కీ తొలి కేబినెట్ భేటీ
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)