Breaking News

పేజర్ దాడులు.. యస్‌ మా పనే

Published on Mon, 11/11/2024 - 07:11

జెరూసలేం: ఇటీవల లెబనాన్‌, సిరియాలపై జరిగిన పేజర్‌ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్‌ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్‌ ఐక్యరాజ్య సమితికి  ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.

తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు  అందిన కొద్ది రోజులకే  ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు  తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.

కాగా ఈ పేలిన పేజర్లను  హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం  మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది. 

ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)