Breaking News

నెతన్యాహు క్రీట్‌కు పారిపోయాడు..!: అరబిక్ మీడియా

Published on Thu, 01/15/2026 - 20:06

ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు టెల్ అవీవ్‌లో లేరా? ఉన్నఫళంగా ఆయన క్రీట్ ద్వీపానికి పయనమయ్యారా? ఈ ప్రశ్నలకు అరబిక్ మీడియా ఔననే సమాధానం చెబుతోంది. albawaba.com అనే మీడియా సంస్థ ఏకంగా ఓ అడుగు ముందుకేసి.. నెతన్యాహు పారిపోయాడంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకించింది.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి బోయింగ్ 767 (4ఎక్స్-ఐఎస్ఆర్) విమానం గుర్తుతెలియని గమ్యస్థానానికి చేరుకుంది. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో అరబిక్ వార్తాసంస్థ ఈ విమానం ఏథెన్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు పేర్కొంది.

 ఈ విమానం బెంజమిన్ నెతన్యాహుకు చెందిన ‘వింగ్ ఆఫ్ జియాన్’ అని ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ మరికొన్ని అరబిక్ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గురువారం ఉదయం 11.22కు టేకాఫ్ అయిన విమానం.. మధ్యాహ్నం 1.06కు గ్రీస్‌లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడి చేసే అవకాశాలుండడంతో ఇజ్రాయెల్ చీఫ్ గ్రీస్‌కు వెళ్లిపోయాడంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ‘వింగ్ ఆఫ్ జియాన్’లో నెతన్యాహు ఉన్నారా? లేదా? అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 


 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)