Breaking News

ట్రంప్‌కు గోల్డెన్‌ పేజర్‌

Published on Fri, 02/07/2025 - 04:38

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గోల్డెన్‌ పేజర్‌ బహుమతిగా ఇచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న నెతన్యాహు మంగళవారం అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్‌కు ఈ కానుక అందించారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హెజ్‌బొల్లా సాయుద సంస్థ సభ్యులను వేర్వేరు చోట్ల ఒకేసారి వేలాది పేజర్‌లను పేల్చేసి హతమార్చినందుకు గుర్తుగా ఈ బంగారు పేజర్‌ను ట్రంప్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

బంగారు పేజర్‌ను చూశాక ట్రంప్‌ సైతం ఆనాడు శత్రుదేశంలో ఇజ్రాయెల్‌ సాహస దాడి ఆపరేషన్‌ మెచ్చుకుంటూ ‘‘ అది నిజంగా ఒక గొప్ప ఆపరేషన్‌’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ సైతం నెతన్యాహు దంపతుల ఒక ఫొటోను బహూకరించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాదులు ఉపయోగించిన వేలాది పేజర్లు పేలాయి. ఆ మరుసటి రోజే వందలాది వాకీటాకీలు పేలాయి. ఈ వరుస ఘటనల్లో మొత్తం 39 మంది హెజ్‌బొల్లా సభ్యులు మరణించగా, దాదాపు 3,000 మంది గాయపడ్డారు.

 లెబనాన్‌లో పేజర్‌ పేలుళ్లకు తామే కారణమని దాదాపు రెండు నెలల తర్వాత నెతన్యాహు వ్యాఖ్యానించడం తెల్సిందే. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో పేలుళ్లకు కొన్ని నెలల ముందు హెజ్‌బొల్లా ఆర్డర్‌ చేసిన పేజర్లలో ఇజ్రాయెల్‌కు గూఢచార సంస్థ మొస్సాద్‌ పేలుడు పదార్థాలను అమర్చినట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ అక్టోబర్‌ దాడి తరువాత గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్‌ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్‌– హెజ్‌బొల్లా మధ్య పోరు సాగుతోంది. ఈ దాడుల్లో గ్రూప్‌ మాజీ చీఫ్‌ హసన్‌ నస్రుల్లా సహా పలువురు హెజ్‌బొల్లా నేతలు హతమయ్యారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)