Breaking News

ఎవరెస్ట్‌: 53 ఏళ్ల వయసులో విజయవంతంగా 27వసారీ.. తన రికార్డు తానే

Published on Thu, 05/18/2023 - 03:29

కఠ్‌మాండూ: నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు. 53 ఏళ్ల రీటా బుధవారం ఉదయం విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్‌ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిçష్కృతమైంది.

గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్‌ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్‌ దవా సమం చేశారు. దీంతో రీటా బుధవారం మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ఈయన 1994 మే 13న తొలిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరారు. రీటా గతంలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు.

సీనియర్‌ మౌంటేన్‌ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్‌మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్‌ సీజన్‌లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్‌ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు