Breaking News

ఎవరెస్ట్‌ మాన్‌ కొత్త రికార్డు

Published on Wed, 05/28/2025 - 05:54

కఠ్మాండు: ఎవరెస్ట్‌ మాన్‌గా పేరు తెచ్చుకున్న నేపాలీ పర్వతారోహకుడు 55 ఏళ్ల కామి రీటా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఆ శిఖరాన్ని 31వసారి అధిరోహించాడు. ఎవరెస్టును అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తిగా సొంత రికార్డునే బద్దలు కొట్టారు. భారత సైనికాధికారుల బృందానికి మార్గనిర్దేశం చేస్తూ మంగళవారం తెల్లవారుజా మున 4 గంటలకు కామి ఎవరెస్టును అధిరోహించాడు. కామి నేపాల్‌లోని సోలుకుంబ్‌ సమీపంలోని థామే గ్రామంలో జన్మించాడు. తన జీవితాన్ని పర్వతారోహణకే అంకితం చేశాడు. 1994లో ఒక వాణిజ్య యాత్రకు మార్గదర్శకునిగా తొలిసారి ఎవరెస్టును అధిరోహించారు.

అప్పటి నుంచి దాదాపు ఏటా ఆ ఘనత సాధిస్తూ వచ్చారు. 2023, 2024ల్లోనైతే రెండేసిసార్లు ఎక్కారు. మరో నేపాలీ షెర్పా పసంగ్‌ దావా 29సార్లు ఎవరెస్టును ఎక్కారు. ‘‘నారికార్డులతో సంతోషంగా ఉన్నా. కానీ రికార్డులు చివరికి బద్దలవుతాయి. నా రికార్డులు ప్రపంచ వేదికపై నేపాల్‌ గుర్తింపుకు దోహదపడటం సంతోషంగా ఉంది’’ అని కామి అన్నాడు. బ్రిటిష్‌ పర్వతారోహకు డు కెంటన్‌ కూల్‌ ఇటీవలే 19వసారి ఎవరెస్టు ఎక్కారు.

దాన్ని అత్యధికసార్లు అధిరోహించిన షెర్పాయేతర వ్యక్తిగా స్వీయ రికార్డునే బద్దలు కొట్టారు. ఎవరెస్టు ఎక్కే సీజన్‌ త్వరలో ముగియనుంది. ఈ ఏడాది 500 మందికి పైగా ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఎవరెస్ట్‌ తో సహా పలు ఇతర శిఖరాలను ఎక్కడానికి నేపాల్‌ ఈ సీజన్‌లో 1,000కి పైగా పర్మిట్లు జారీ చేసింది. ఇటీవల ఎవరెస్ట్‌ ఎక్కేవారి సంఖ్య పెరగడం పర్యావరణ ఆందోళనలకు దారితీసింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)