Breaking News

Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి

Published on Tue, 07/23/2024 - 07:34

నేపాల్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన  నేపాల్‌ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్‌కు చెందుతుంది.

ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్‌-ఎంయూఎల్‌) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)