Breaking News

నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు 

Published on Thu, 07/06/2023 - 19:25

ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహాల్ ఇటీవల భారతీయ వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తాను ప్రధానమంత్రి కావడానికి ఆయన చాలా సహాయం చేశారని చేసిన వ్యాఖ్యలు నేపాల్ లో పెను దుమారాన్ని రేపాయి. నేపాల్ ప్రధాని నియామకం ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందని ప్రధాని ప్రచండకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పదవికి  రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి అక్కడి ప్రతిపక్షాలు.  

ప్రఖ్యాత భారత వ్యాపారి ప్రీతమ్ సింగ్ పేరిట కిరణ్ దీప్ సంధు రాసిన జీవితచరిత్ర పుస్తకం "రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్" ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ ప్రచండ. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-నేపాల్ సంబంధాలు బలపడటానికి ప్రీతమ్ సింగ్ చాలా సహాయపడ్డారని, తన రాజకీయ జీవితం తొలినాళ్లలో కూడా అయన చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. నన్ను ప్రధాన మంత్రిని చేయడానికి ఆయన అనేకమార్లు ఢిల్లీ వెళ్లడమే కాదు అటు ఢిల్లీ నాయకులతోనూ, ఇటు ఖాట్మండు నాయకులతోనూ సంప్రదింపులు జరిపారని తెలిపారు. 

ఈ వ్యాఖ్యలకు నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ప్రధాని వ్యాఖ్యలు జాతి స్వాతంత్య్రానికి, గౌరవానికి, రాజ్యాంగానికి, చట్టసభకే అవమానకరమని ప్రతిపక్ష నాయకుడు కెపి శర్మ ఓలి అన్నారు. 

ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ తోపాటు ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీల నేతలు ప్రధాని ప్రచండ రాజీనామాను డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. 

నేపాల్ ప్రధాని ప్రచండ ప్రతిస్పందిస్తూ నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ పాత్ర ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ప్రీతమ్ సింగ్ కు సాంఘిక సంక్షేమం మీదనే కాదు రాజకీయాల పైన కూడా అంతే ఆసక్తి ఉండేదని చెప్పాలనుకున్నట్లు తెలిపారు. 

ప్రతిపక్షాలు మాత్రం మాకు మీ వివరణ అక్కర్లేదు.. మీ రాజీనామా మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి నిరవధికంగా అంతరాయం కలిగింది.  

ఇది కూడా చదవండి: వింబుల్డన్‌లో దారుణం..  స్కూల్‌లోకి దూసుకెళ్లిన కారు.. 

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)