Breaking News

విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్‌ ప్రధాని ‘ప్రచండ’

Published on Fri, 07/12/2024 - 18:53

ఖాఠ్మాండూ: నేపాల్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. శుక్ర‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌భుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్ర‌ధాన‌మంత్రి పుష్ప క‌మ‌ల్ ద‌హ‌ల్ ప్ర‌చండ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) ప్రభుత్వానికి త‌మ‌ మద్దతును ఉపసంహరించుకోవడంతో 'ప్రచండ' విశ్వాస తీర్మానాన్ని కోల్పోయారు.

275 మంది సభ్యులు క‌లిగిన పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం నుంచి గ‌ట్టేకాలంటే 138 ఓట్ల మెజార్టీ అవసరం. విశాస తీర్మానంలో ప్రచండకు 63 ఓట్లు రాగా. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు ప‌డ్డాయి. మాజీ ప్రధాని కేపీ.శర్మ ఓలి నేతృత్వంలోని క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.

కాగా డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్ర‌ధానిగా ప్ర‌చండ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నాలుగు అవిశాస్వ తీర్మానాల‌ను ఎదుర్కొన్నారు. మూడింట్లో గెట్ట‌క‌గా.. చివ‌రిదైనా నాలుగో దాంట్లో ఓడిపోయారు.

అయితే  మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి త‌మ‌ మద్దతు ఉపసంహరించుకుంది. 

ఈ క్ర‌మంలో ఓలీని త‌దుప‌రి ప్ర‌ధాన ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. ఇక పార్ల‌మెంట్‌లో నేపాలీ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం (167) ఎక్కువ‌గా ఉంది.
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)