రేపే నేపాల్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

Published on Wed, 03/04/2026 - 09:22

కఠ్మాండు:  నేపాల్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. రాజకీయ అనిశి్చతి, జెన్‌ జీ యువత పోరాటం వల్ల ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. సుశీల కర్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. నేపాల్‌ ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 1.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2022 నవంబర్‌లో జరిగిన పార్లమెంల్‌ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలావరకు యువతే కావడం విశేషం. నేపాల్‌లో 18 ఏళ్ల వయసు రాగానే ఓటు వేసే హక్కు లభిస్తుంది. యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పారీ్టలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అవినీతిని అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు.  

రాజకీయ అస్థిరతకు మారుపేరు  
నేపాల్‌ పార్లమెంట్‌లో మొత్తం 275 స్థానాలున్నాయి. దిగువ సభ అయిన ‘ప్రతినిధుల సభ’లో 165 స్థానాలుండగా, వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్‌ చేస్తాయి. నేపాల్‌ పార్లమెంట్‌లో ఏకైక పార్టీ అధికారం చెలాయించిన సందర్భాలు అరుదే. ఎక్కువగా కూటమి ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. రెండు లేదా మూడు పారీ్టలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయ అస్థిరతకు మారుపేరు నేపాల్‌. గత రెండు దశాబ్దాల్లో 15 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  

బాలేంద్ర షా పారీ్టకి విజయావకాశాలు  
నేపాల్‌లో ప్రధానంగా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌దే ఆధిపత్యం. ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడిన సందర్భాలున్నాయి. ప్రజాగ్రహం వల్ల గత ఏడాది పతనమైన ప్రభుత్వం ఈ రెండు పారీ్టల కలయికతో ఏర్పడినదే. 2022లో స్థాపించిన నేషనల్‌ ఇండిపెండెంట్‌ పార్టీకి ఈసారి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రచార సభలకు జనం పోటెత్తారు. ఖాట్మాండు మాజీ మేయర్, నేషనల్‌ ఇండిపెండెంట్‌ పార్టీ ముఖ్యనేత బాలేంద్ర షా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నేషనల్‌ ఇండిపెండెంట్‌ పార్టీ విజయం సాధిస్తే బాలేంద్ర షా ప్రధానమంత్రి కావడం తథ్యమని చెబుతున్నారు.    

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)